Wednesday, May 21, 2025
Homeకరీంనగర్ప్రజల అభీష్టం మేరకు ముంబై కు లహరి ఏసి స్లీపర్ బస్సు సర్వీసు: మంత్రి పొన్నం

ప్రజల అభీష్టం మేరకు ముంబై కు లహరి ఏసి స్లీపర్ బస్సు సర్వీసు: మంత్రి పొన్నం

- Advertisement -
  • – వేములవాడ నుంచి ముంబాయి వెళ్ళే ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి , ప్రభుత్వ విప్..
    నవతెలంగాణ వేములవాడ 

    ప్రజల అభీష్టం మేరకు ముంబై కు లహరి స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వేములవాడ చెరువు కట్ట గుడి ప్రాంగణం వద్ద వేములవాడ నుంచి ముంబై వరకు వెళ్లే రెండు ఏసీ బస్సులను రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ఎస్పి మహేష్ బి.గీతే,లతో కలిసి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు మే 20 నుంచి వేములవాడ నుండి ముంబై వెళ్ళెందుకు ఏసీ స్లిపర్ బస్సు లహరి సర్వీసులను ప్రారంభిస్తున్నామని అన్నారు. 2 లహరి సర్వీస్ ఏసీ బస్సులను ముంబై సర్వీస్ నిమిత్తం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుండి బయలు దేరి తెల్లారి ఉదయం 4.45 గంటలకు ముంబై కు చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజు ముంబై నగరానికి అప్ అండ్ డౌన్ సర్వీస్ నడుస్తుందని అన్నారు.
  • లహరి బస్సు సర్వీస్ లో 22 సీట్స్, 20 స్లిపర్ బెర్త్ లు ఉన్నాయని, ప్రతి సీటుకు చార్జింగ్ పాయింట్, ఏసి అడ్జెస్ట్ మెంట్ సౌకర్యం ఉందని, వైఫై సౌకర్యం బస్సులో కల్పించామని, సిసి కేమేరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి ముంబైకు పెద్దలకు స్లీపర్ బెర్త్ కు 2 వేల రూపాయలు, సీటు 1500 రూపాయలకు, పిల్లలకు బెర్త్ 1600, సీట్ 1230 రూపాయలకు టికెట్ ఉంటుందని , పట్టణ వాసులు ఈ సర్వీసు ను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ముంబై లో ఉన్న తెలంగాణ బిడ్డల ప్రయాణంకి ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామనీ,ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారనీ రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం లో మహిళలకు మహా లక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం తో పాటు ఈపథకం విజయవంతం కావడానికి కష్టపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ లు ,కండక్టర్ కు ,సిబ్బంది సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పని చేస్తున్నామని,ఆర్టీసీ లో కొత్త నియామకాలు ,కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

అంతకుముందు మంత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రాజన్న స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణం నుండి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు అదే బస్సులో ప్రయాణించీ ముంబై వెళ్ళే ప్రయాణికులకు, పట్టణ ప్రజలకు స్థానిక ప్రజలకు ముంబై లో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పి శేషాద్రిని రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ రాజు, ప్రజా ప్రతినిధులు , ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు డిపో మేనేజర్లు,ప్రజలు, ప్రయాణికులు సంబంధిత అధికారులు, తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -