Monday, May 19, 2025
Homeఅంతర్జాతీయంబద్ధలైన లకి-లకి అగ్నిపర్వతం.. 6 కి.మీ. ఎత్తుకు ఎగసిన బూడిద

బద్ధలైన లకి-లకి అగ్నిపర్వతం.. 6 కి.మీ. ఎత్తుకు ఎగసిన బూడిద

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. ఫ్లోర్స్‌ దీవిలోని మౌంట్‌ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిపర్వతం  నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు బూడిద ఎగసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వత సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -