- Advertisement -
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం
సిడ్నీ : భారత స్టార్ షట్లర్, వరల్డ్ నం.14 లక్ష్యసేన్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో జపాన్ షట్లర్ యుషి టనకపై ఏడో సీడ్ లక్ష్యసేన్ 21-15, 21-11తో వరుస గేముల్లో గెలుపొందాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో లక్ష్యసేన్ అదరగొట్టాడు. 6-3తో దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ విరామానికి ముందు కొన్ని పొరపాట్లు చేసినా.. వేగంగా సరిదిద్దుకున్నాడు. 13-9తో ముందంజ వేసిన లక్ష్యసేన్ అదే జోరులో తొలి గేమ్ నెగ్గాడు. రెండో గేమ్‌లో 10-6తో విరామ సమయానికి ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన లక్ష్యసేన్ సూపర్ షోతో అలవోకగా రెండో గేమ్‌తో పాటు టైటిల్‌ను దక్కించుకున్నాడు.
- Advertisement -



