Monday, May 26, 2025
Homeజాతీయంకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ యాదవ్‌

కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన లాలూ యాదవ్‌

- Advertisement -

పాట్నా: తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరణ విధిస్తున్నట్టు ఆదివారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. కుటుంబంతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌ ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన కుటుంబ విలువలు, సాంప్రదాయాలకు అనుగుణంగా లేవని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తేజ్‌ ప్రతాప్‌ చర్యలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. కాగా అనుష్కయాదవ్‌, తాను 12 ఏండ్లుగా ప్రేమలో ఉన్నామని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని, తన కుటుంబాన్ని, తనను కించపరిచేలా ఫొటోలను ఎడిట్‌ చేశారని ఆయన తెలిపారు.
ఇలాంటివి సహించలేం : సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ బహిష్కరణపై తేజస్వి యాదవ్‌
ఆర్జేడీలో కీలకంగా వ్యవహరించే లాలూ రెండో కుమారుడు తేజస్వి యాదవ్‌ ఈ సంఘటనపై స్పందించారు. తన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉందని తెలిపారు. అయితే బహిష్కరణపై తండ్రి నిర్ణయం చెల్లుతుందని చెప్పారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని అన్నారు. బీహార్‌ ప్రజల కోసం తాము అంకితభావంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -