Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంలంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి

లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి

- Advertisement -

– జూన్‌ 8న గాంధీ భవన్‌ ముందు నిరసన ప్రదర్శన
– లంబాడీ హక్కుల పోరాట సమితి
నవతెలంగాణ- బంజారాహిల్స్‌

లంబాడీ సామాజిక తరగతికి మంత్రి పదవి ఇవ్వాలని, లేని పక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని నంగార భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గణేష్‌ నాయక్‌, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గణేష్‌ నాయక్‌ మాట్లాడారు. జూన్‌ 8న లంబాడీ హక్కుల పోరాట సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో చీరలు, గాజులతో గాంధీ భవన్‌ ముందు వేలాది మంది లంబాడీలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి, ఆయన స్పందించని పక్షంలో రాహుల్‌ గాంధీకి వాటిని పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ భవన్‌ ముందు చేసే నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీ, కోయ, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు పున్ని బాయి, దేవి బాయి, అచ్చి బాయి, బాణోత్‌ వసంత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad