Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘట్కేసర్ నుండి భువనగిరి వరకు ఎం ఎం టి ఎస్ రైలు భూసేకరణ

ఘట్కేసర్ నుండి భువనగిరి వరకు ఎం ఎం టి ఎస్ రైలు భూసేకరణ

- Advertisement -

– ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – ఆలేరు
: ఘట్కేసర్ నుండి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ రైలు వచ్చేందుకు వేగవంతం చేసేందుకు  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాస్తవ ను కలిశారు.భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవడానికి మేడ్చల్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లతో ఫోన్లో  మాట్లాడారు.అదేవిధంగా భువనగిరి నుండి రాగిరి వరకు రైళ్లు పొడిగించేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తద్వారా యాదాద్రి కి వచ్చే భక్తులకు ఆలేరు నియోజకవర్గం లోని అనునిత్యం అప్ అండ్ డౌన్ చేసే కార్మికులకు రవాణా సులభతరం అవుతుందన్నారు 

రామన్నపేటలో ఫలక్నామ శబరి నారాయణద్రి ఎక్స్ప్రెస్ లను హాల్టింగ్ గురించి చర్చించగా రైల్వే మేనేజర్ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు వీరితోపాటు సౌత్ సెంట్రల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్  కోట్ల ఉదయనాథ్ ఎంఎంటీఎస్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -