Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి టీహెచ్‌బీ ఆధ్వర్యంలో భూముల వేలం

నేటి నుంచి టీహెచ్‌బీ ఆధ్వర్యంలో భూముల వేలం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాట్‌లు, భూములు, కమర్షియల్ ప్లాట్‌ను విక్రయించేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు నేటి నుంచి ఈనెల 20 వరకు వేలం వేయనుంది. ఇవాళ చింతల్, బాచుపల్లిలోని 22 రెసిడెన్షియల్ ప్లాట్లు, ఫ్లాట్‌లను బహిరంగంగా వేలం వేయనున్నారు. చింతల్‌లో 18 మిడ్ ఇన్‌కమ్ గ్రూప్, హై ఇన్‌కమ్ గ్రూప్ ప్లాట్లు, బాచుపల్లిలో నాలుగు ఫ్లాట్‌లు వేలం వేయనున్నారు. ఇక కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్-1, ఫేజ్2-2లోని నాలుగు కమర్షియల్ వాణిజ్య ప్లాట్ల ఈ-వేలాన్ని అక్టోబర్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. అందులో 726 చదరపు గజాలు, మిగిలినవి 2,397 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు, 6,549 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి.

ఇక నాంపల్లిలోని 1,148 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఒక కమర్షియల్ ప్లాట్‌ను ఈనెల 8న ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. అంతేకాకుండా ఈనెల 9, 10 తేదీల్లో చింతల్‌లోని 10,890 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్‌కు ఈ-వేలం నిర్వహిస్తారు. అదే రోజుల్లో, మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో 13,503 చదరపు గజాలు, 5,953.20 చదరపు గజాలు, 3,630 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కూడా అమ్మకానికి పెట్టనున్నారు. సంగారెడ్డిలోని సదాశివపేట, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, మరికొన్ని జిల్లాల్లోని భూములను విక్రయించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -