- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భూవివాదాలతో ఓ మరిది వదిన గొంతు కోసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో చోటుచేసుకుంది. మహిళ భర్త బొంత ఆశయ్య సోదరుడు కొంతకాలం క్రితం మరణించారు. ఆశయ్యకు తన అన్న భార్య వెంకటమ్మ (40)తో భూ వివాదం జరుగుతోంది. మంగళవారం ఉదయం వ్యవసాయ బావి వద్ద ఇద్దరూ ఈ విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆశయ్య తన వదిన గొంతు కోశాడు. స్థానికులు ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



