Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారం

రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారం

- Advertisement -

– రాష్ట్ర అగ్రికల్చర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ రామ్‌రెడ్డి గోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-కామేపల్లి

రెవెన్యూ సదస్సుల ద్వారానే భూ సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర అగ్రికల్చర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ రామ్‌రెడ్డి గోపాల్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బాసిత్‌ నగర్‌, జాస్తిపల్లి గ్రామాల్లో తహసీల్దార్‌ సీహెచ్‌ సుధాకర్‌, డీటీ రఫీ ఆధ్వర్యంలో మంగళవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు ఆయన హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తారని తెలిపారు. పేదల పక్షాన ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -