నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నుండి మంజీరైన ఐదువేలక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణానికి సోమవారం పంచాయతీరాజ్ ఏఈ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తాద్రి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఈర్ల ఆశన్న, పంచాయతీ కార్యదర్శి రాకేష్ తదితరులతో కలిసి గ్రామంలోనిచోట్ల భూములను పరిశీలించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఉపకేంద్ర నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నట్లు వారు వివరించారు. త్వరలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తుల సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పేరు పెద్ద వీరయ్య ,వీరయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి భూముల పరిశీలన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



