నవతెలంగాణ-హైదరాబాద్ : ల్యాండ్‌మైన్ పేలి ముగ్గురు పోలీసులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ సరిహద్దులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదరుపడగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఎదరుకాల్పులు జరిగాయి. పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులను ట్రాప్ చేసిన మావోయిస్టులు వారు ల్యాండ్‌మైన్ ఉన్న స్పాట్‌కు రాగానే ఒక్కసారిగా పేల్చేశారు. ఈ భారీ పేలుడులో కూబింగ్‌కు వచ్చిన ముగ్గురు పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలో పేలిన ల్యాండ్‌మైన్..ముగ్గురు పోలీసులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES