Tuesday, October 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా రివీకోల్డ్ దగ్గుమందు స్వాధీనం

భారీగా రివీకోల్డ్ దగ్గుమందు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖపట్నంలో నిషేధిత రివికోల్డ్ కాఫ్ సిరప్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. మర్రిపాలెం ప్రాంతంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ మెడికల్ ఏజెన్సీ వద్ద డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలిసి విశాఖ పోలీసులు దాడులు నిర్వహించి, సుమారు రూ.4.5 లక్షల విలువైన 5,900 సిరప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం, నాలుగేళ్లలోపు పిల్లలకు వాడరాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన రివికోల్డ్ కాఫ్ సిరప్‌ను ఏజెన్సీ వద్ద నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. సిరప్‌పై తప్పనిసరిగా ముద్రించాల్సిన హెచ్చరిక “నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడరాదు” అనే సూచన లేకపోవడంతో ఈ మందులు చట్టవిరుద్ధంగా అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

విచారణలో ఈ సిరప్‌లు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజాజ్ ఫార్ములేషన్స్, భగవాన్‌పూర్ (రూర్‌కీ, హరిద్వార్) యూనిట్‌లో తయారైనవని గుర్తించారు. దీనిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ 26A ప్రకారం తయారీదారు సంస్థపై కేసు నమోదు చేసినట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -