Sunday, June 15, 2025
E-PAPER
Homeబీజినెస్కుబేరుల్లో రెండో స్థానంలోకి లారీ ఎల్లిసన్‌

కుబేరుల్లో రెండో స్థానంలోకి లారీ ఎల్లిసన్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : టెక్‌, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ సొంతం చేసుకున్నారు. 243 బిలియన్‌ డాలర్ల సంపదతో ఎల్లిసన్‌ రెండో అతిపెద్ద ధనవంతుడిగా చోటు సంపాదించుకున్నారని ఫోర్ట్స్‌ వరల్డ్‌ బిలియనీర్స్‌ జాబితా వెల్లడించింది. మేతో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ షేరు భారీగా పెరగడంతో ఆయన సంపద పెరిగింది. ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ 407 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బెజోస్‌ సంపద 228 బిలియన్‌ డాలర్లు, మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద 239 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వీరిని అధిగమించి ఎల్లిసన్‌ రెండో స్థానం సొంతం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -