Sunday, March 22, 2026
E-PAPER
Homeజిల్లాలుయూరియా పంపిణీలో సరికొత్త సాంకేతికత

యూరియా పంపిణీలో సరికొత్త సాంకేతికత

- Advertisement -

జిల్లా వ్యవసాయ అధికారి జె.బాబురావు 
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలోని ప్రయివేటు ఎరువుల, విత్తనాల దుకాణాల్లో ప్రత్యేక  యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి జె.బాబురావు తెలిపారు. సోమవారం మండలంలోని కొయ్యూరు గ్రామంలో గల ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం, హాక ఫార్మర్ సర్వీస్ సెంటర్, డీసీఎంఎస్ సెంటర్లను సందర్శించి, యూరియా పంపిణి విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని  వ్యవసాయ సహకార సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ లో నిలబడే అవసరం లేకుండా యూరియా ఆప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ పంటల సాగుకు అవసరమైన యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని ఇట్టి విషయంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సులభతరమైన యాప్ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చునని యాప్ ఉపయోగించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన సమీప వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని ఆయన తెలిపారు. అదేవిధంగా యూరియా బుక్ చేసుకుని వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా అందించాలని డీలర్లను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -