– హెచ్‌ఆర్‌సీకి 163 మంది న్యాయవాదుల ఫిర్యాదు
– సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
న్యాయవాది జి.స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై 163 మంది న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిబ్రవరి 4న చేవెళ్ల పరిధిలో జరిగిన భూ వివాద ఘటనలో న్యాయవాది జి.స్వప్న కుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. స్నప్న కుమారి తన సోదరున్ని నిందితునిగా పేర్కొంటూ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే పోలీసులు సకాలంలో నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనీ, దీనిని విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించాల్సిన విషయమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. న్యాయవాదులు చేసిన ఫిర్యాదును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డిని సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసును మార్చి 6కు వాయిదా వేసింది.
మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యంతోనే.. న్యాయవాది స్వప్న కుమారి హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



