Thursday, May 22, 2025
Homeజాతీయంసెలవుల్లో పనికి లాయర్లు ఇష్టపడటంలేదు

సెలవుల్లో పనికి లాయర్లు ఇష్టపడటంలేదు

- Advertisement -

– వేసవి సెలవులకు సీజేఐ ‘పాక్షిక పనిదినాలు’గా నామకరణం
న్యూఢిల్లీ:
కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్న అంశంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లాయర్లు సెలవు దినాల్లో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం తన కేసును విచారించాలని ఓ న్యాయవాది కోరారు. సీజేఐ జస్టిస్‌ గవారు, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిV్‌ాతో కూడిన ధర్మాసనానికి ఆ అభ్యర్థన ఆగ్రహం తెప్పించింది. ”న్యాయమూర్తులు సెలవుల్లో పనిచేస్తున్నారు. అయినా సరే పెండింగ్‌ కేసుల విషయంలో మమ్మల్ని నిందిస్తున్నారు. కానీ, సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులే” అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వేసవి సెలవులను ‘పాక్షిక పనిదినాలుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవారు బుధవారం నామకరణం చేశారు. మే 23 నుంచి జులై వరకు వేసవి సెలవుల కారణంగా సుప్రీంకోర్టు మూసివేయబడుతుంది. అయితే ఈ సెలవులను పాక్షిక పనిదినాలుగా నామకరణం చేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. కోర్టు సెలవుల మొదటి వారంలో మొదటి ఐదుగురు సీనియర్‌ జడ్జీలు విచారణ చేపడతారని అన్నారు. సెలవు నెలల్లో మొత్తం 21 బెంచ్‌లు విచారణ చేపడతాయని న్యాయవాదులకు తెలిపారు. అన్నారు. పర్యావరణ సంబంధిత అంశాలపై తన ధర్మాసనం దృష్టి సారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు జడ్జీలు సిద్ధంగా ఉండాలని, సెలవు దినాల్లో అనవసర వాయిదాలు వేయవద్దని, ధర్మాసనానికి సహకరించాలని న్యాయవాదులను ఆయన కోరారు. 2024, ఆగస్టు నాటి సమాచారం ప్రకారం.. సుప్రీంకోర్టులో రికార్డు స్థాయిలో 82,887 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
వెకేషన్‌ బెంచ్‌లంటే వేసవి, శీతాకాలపు సెలవుల్లో సీజేఐ నియమించే ప్రత్యేక బెంచ్‌లు. ఈ బెంచ్‌లు ‘అత్యవసర అంశాలను’ విచారించడానికి ముఖ్యంగా సెలవు దినాల్లో బెయిల్‌, హెబియస్‌ కార్పస్‌ , ఇతర ప్రాథమిక హక్కుల సమస్యలకు సంబంధించిన పిటిషన్‌లను విచారించేందుకు ఏర్పాటు చేస్తారు.
2022లో, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.వై. చంద్రచూడ్‌ శీతాకాల సెలవుల సమయంలో సుప్రీంకోర్టు సెలవుల బెంచ్‌లు అందుబాటులో ఉండవని అన్నారు. దీంతో కోర్టులను సెలవుల సమయంలో మూసివేయాలా వద్దా అనే చర్చకు ప్రారంభమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -