నవతెలంగాణ-హైదరాబాద్: ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ(Disney)లో వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుంది. ఫిల్మ్, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. డిస్నీ ఎంటర్‌టైన్మెంట్ డివిజన్‌లో ఎక్కువ శాతం ఉద్యోగులు తొలగింపు ఉన్నది. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డిస్నీ టీవీ స్టాఫ్‌ను ఎక్కువగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలం ఉద్యోగులను తొలగించడం డిస్నీ కంపెనీనికి ఇది నాలుగోసారి. 2023 సంవత్సరంలో డిస్నీ కంపెనీ సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తీసివేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది డిస్నీ కంపెనీ సుమారు 7.5 బిలియన్ల డాలర్ల ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నెలలో సుమారు 200 మంది ఉద్యోగులను డిస్నీ తొలగించింది.
వాల్ట్ డిస్నీలో ఉద్యోగుల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES