Saturday, May 24, 2025
Homeతాజా వార్తలుకేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు : మోడీ

కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు : మోడీ

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ : కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని ప్రధాని మోడీ శనివారం అన్నారు. నేడు ఢిల్లీలో మోడీ అధ్యక్షతన నీతి అయోగ్‌ 10వ పాలకమండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ‘మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు అని చెప్పినట్లు నీతి అయోగ్‌ ఎక్స్‌ పోస్టు ద్వారా వెల్లడించింది. వికసిత్‌ భారత్‌ 2047 థీమ్‌తో ఈ కౌన్సిల్‌ సమావేశం జరిగినట్లు మోడీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి లక్ష్యం వికసిత్‌ భారత్‌, ప్రతి రాష్ట్రం వికసిత్‌ అయినప్పుడు.. భారత్‌ కూడా వికసిత్‌ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష అని మోడీ అన్నారు.కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఈ నితిఅయోగ్‌ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరవ్వాలి. కానీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా ఈ కౌన్సిల్‌కి హాజరవ్వలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -