నవతెలంగాణ – మద్నూర్
సర్పంచ్ ఎన్నికలు అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా క్రమశిక్షణతో పని చేయాలని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. ఎన్నికల్లో పోటీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని ఎన్నికల్లో అభ్యర్థుల గెలిపే ముఖ్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని అందించాలని మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 20 గ్రామ పంచాయతీల అభ్యర్థుల పేర్లు ప్రకటించగా మద్నూర్ మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థి పేరు హైకమాండ్ ప్రకటించవలసి ఉందని తెలిపారు.
గ్రామపంచాయతీల వారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి
1. చిన్న షక్కర్గా దిగంబర్ .2, హెచ్ కేలూర్ జి లక్ష్మణ్ 3. పెద్ద షక్కర్గా విశాలక్ష్మి 4. గోజేగావ్ శివాజీ రాథోడ్ 5. తడి ఇప్పర్గా సుదర్శన్ గొండ (మున్న) 6. మేనూర్ అశోక్ పటేల్ 7. శాఖాపూర్ గంగాధర్ 8. సుల్తాన్ పేట్ నివర్తి పటేల్ 9. లచ్చన్ సంజయ్ 10. రూసేగావ్ సావిత్రి రామస్వామి 11. రాచూర్ ఎల్ ఆకాష్ 12. ఎక్లారా పెద్ద మహేష్ పటేల్ 13. దన్నూర్ డి జయశ్రీ దేవిదాస్ 14. సోమూర్ సంగ్రామ్ పటేల్ 15. అంతాపూర్ బి పార్వతి నాగనాథ్ 16. పెద్ద తడగూర్ ఈరన్న 17. చిన్న తడగూర్ ప్రకాష్ సూర్య వంశీ 18. అవల్గావ్ ఎస్ గంగాబాయి 19. కొడిచర పిరయ్య 20. చిన్న ఎక్లారా మల్లికార్జున్ పటేల్. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల ప్యానల్ అభ్యర్థులను మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు ప్రకటించగా ఈ విలేకరుల సమావేశంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు జావిద్ పటేల్ పాల్గొన్నారు.
అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


