– జిల్లా కలెక్టర్ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు
నవతెలంగాణ-రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రుద్రంగి మండల బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆధ్వర్యంలో శనివారం రుద్రంగి పోలీస్టేషన్ లో పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జిల్లా కలెక్టర్ సందిప్ కుమార్ ఝా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానించడన్నీ తీవ్రంగా ఖండించారు.ప్రోటో కాల్ పాటించకుండా అవమానించిన జిల్లా కలెక్టర్ ను సస్పెండ్ చేసి ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలనీ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం అలాపిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ సైరాన్ వేసుకొని వచ్చి జాతీయ గీతాన్ని అలాగే ఆది శ్రీనివాస్ ను అవమానించారాని అన్నారు.ఆది శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ అయినందువల్లే జిల్లా కలెక్టర్ అవమానించారాని,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి విషయంలో జిల్లా కలెక్టర్ గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించక ప్రోటో కాల్ ఉల్లాగించడంపై కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తు,జిల్లా కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలనీ రాష్ట్ర ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి,మాజీ జడ్పీటీసీ గట్ల మినయ్య, నాయకులు ఎర్రం గంగ నర్సయ్య,ఆలయ చైర్మన్ కొమిరె శంకర్,నాయకులు తర్రె మనోహర్,ఇప్ప మహేష్,దువ్వకా గంగాధర్,అట్టపెల్లి మల్లేశం,గండి అశోక్,రత్నం, కుమార్,నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు
కలెక్టర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES