Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కు వినియోగించుకున్న నాయకులు

ఓటు హక్కు వినియోగించుకున్న నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి
రెండో విడుత సర్పంచ్ ఎన్నికల సందర్బంగా సొంత గ్రామాల్లో పూర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మాజి మంత్రి మండవ వెంకటేశ్వరరావు డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి లో, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ రాంపూర్ డి లో, డిసిసి అధ్యక్షులు కాట్ పల్లి నాగేష్ రెడ్డి ముళ్ళంగిలో, బిజెపి జిల్లా అధ్యక్షులు అమృత పూర్ గ్రామంలో  దినేష్ పటేల్ కులాచారి, ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్ రాంపూర్ డి లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో మ సొంత గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడం సంతోషకరమన్నారు.గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కి పునరంకితం కావాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -