నవతెలంగాణ-రాయికల్: నవతెలంగాణ దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను శుక్రవారం రాయికల్ పట్టణ తొలి మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమాండ్లు,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్‌లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువెళ్తూ నవతెలంగాణ దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.సమాజాభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ నిజాయితీ గల వార్తలను అందిస్తున్న నవతెలంగాణ యాజమాన్యాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ప్రతినిధి నాగిరెడ్డి రఘుపతి పాల్గొన్నారు.
నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



