- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హాకీ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ (80) గురువారం ఉదయం కన్నమూశారు. ఆగస్టు 12న తీవ్ర అనారోగ్యంతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రి చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే, గత కొంతకాలంగా ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నీస్ ఆడగాడు. వేస్ పేస్ 1972 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు.
- Advertisement -