నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం లెఫ్ట్ ఫ్రంట్ గురువారం 32 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సిపిఎం నుంచి ఆఫ్రీన్ బేగం (బల్లీగంజ్), మణిరుల్ ఇస్లాం (మెటియాబ్రూజ్), హిమంశు గిరి (ఖేజురి), సమరేంద్ర నాథ్ నైయా (నంది గ్రామ్) సహా 28 మంది, సిపిఐ నుంచి ముగ్గురు, ఆర్ఎస్పి నుంచి ఒకరు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం మాట్లాడుతూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై న్యాయ విచారణ చేపట్టడం ప్రజల తొలి విజయంగా పేర్కొన్నారు. పోలింగ్ ముందుగానే అర్హులైన ప్రతీ ఓటరు పేరూ జాబితాలో నమోదయ్యే వరకూ వామపక్ష నాయకులు విశ్రమించబోరని తెలిపారు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదివరకే 192 మంది అభ్యర్థులతో లెఫ్ట్ ఫ్రంట్ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ రెండో జాబితా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



