Thursday, May 15, 2025
Homeజాతీయంకోల్‌కతాలో వామపక్షాల శాంతి ర్యాలీ

కోల్‌కతాలో వామపక్షాల శాంతి ర్యాలీ

- Advertisement -

– ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఎర్రజెండాలతో ప్రదర్శన
– దేశాన్ని మతపరంగా విభజించే కుట్ర : లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు
కోల్‌కతా:
యుద్ధానికి, ఉగ్రవాదానికి, మతతత్వానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీల భారీ శాంతి ర్యాలీ నిర్వహించాయి. మంగళవారం జరిగిన ఈ ర్యాలీలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ధరమ్‌తోల్లా లెనిన్‌ విగ్రహం వద్ద క్రాసింగ్‌ నుంచి సీల్దా వరకూ రద్దీగా ఉంటే రహదారిపై ఈ ర్యాలీ జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఎర్రజెండాలు ధరించి ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్‌లో శాంతి కోసం ఈ ర్యాలీ పిలుపునిచ్చింది. భారత ఉప ఖండంలో అమెరికా సామ్రాజ్యవాదం నిర్దేశించిన పరిస్థితులు ఉండకూడదని ర్యాలీ డిమాండ్‌ చేసింది. ఈ ర్యాలీ చారిత్రాత్మకమైనదని వామపక్ష పార్టీల కార్యకర్తలు పేర్కొన్నారు. యుద్ధోన్మాదం, ఉగ్రవాదం, దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలకు వ్యతిరేకంగా ర్యాలీలో నినాదాలు చేశారు. రెండు సరిహద్దు దేశాలకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ జోక్యం చేసుకోవడం రెండు దేశాల ప్రజలకు అవమానకరమని తెలిపారు. ర్యాలీ ప్రారంభానికి ముందు లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు విలేకరులతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి ఒక దుర్మార్గపు సంఘటన అని విమర్శించారు. అయితే ఈ దాడిలో ఆదిల్‌ అనే ముస్లిం యువకుడు పర్యాటకులను రక్షించడానికి ప్రయ్నతిస్తూ ఉగ్రవాదుల చేతిలో మరణించడానే వాస్తవాన్ని మీడియా మరచిపోతుందని అన్నారు.
అలాగే ఈ ర్యాలీని ఉద్దేశించి సీపీఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి సలీం మాట్లాడుతూ దేశంపై దాడి జరిగినప్పుడు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడం అన్ని విధాలుగా అవసరమని అన్నారు. ఐక్యతే మన దేశబలమని, ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి పహల్గాం దాడి తరువాత ఉగ్రవాదులు ప్రయత్నించారని, అయితే ఇదే పనిని చిత్రంగా బిజెపి ఐటి సెల్‌ కూడా చేస్తుందని సలీం విమర్శించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి, ఆయన కుమార్తెను ఐటీ సెల్‌ ట్రోల్‌ చేసిందని తెలిపారు.
అలాగే దేశ ప్రజల ఐక్యత గురించి మాట్లాడినందుకు మరణించిన నేవీ లెఫ్టినెంట్‌ బార్యను కూడా ట్రోల్‌ చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ దీనికి వ్యతిరేకంగా ఎటువంటి వైఖరిని తీసుకోలేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -