Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంజులై 9 సార్వత్రిక సమ్మెకు వామపక్షాల మద్దతు

జులై 9 సార్వత్రిక సమ్మెకు వామపక్షాల మద్దతు

- Advertisement -

– సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
న్యూఢిల్లీ:
జులై 9నాటి సార్వత్రిక సమ్మెకు తమ పూర్తి మద్దతును ఐదు వామపక్షాలు తెలియచేశాయి. పది కేంద్ర కార్మిక సంఘాలు, అఖిల భారత స్థాయిలో రంగాలవారీగా స్వతం త్ర సమాఖ్యలు, సంస్థలతో కూడిన కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఈ సమ్మెకు పిలుపిచ్చింది. ఆ సమ్మెకు మద్దతును తెలియ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పీ, అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ల నేతలు వరుసగా ఎం.ఎ.బేబీ, డి.రాజా, దీపంకర్‌ భట్టాచార్య, మనోజ్‌ భట్టాచార్య, దేవరాజన్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సంఘటితమయ్యే, సమిష్టి చర్యలు చేపట్టే హక్కుతో సహా కార్మికుల మౌలిక ప్రజా స్వామ్య హక్కులను తీవ్రంగా కుదించడానికి ఉద్దేశించిన కార్పొరేట్‌ ఎజెండాలో కీలక భాగమైన లేబర్‌ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపిచ్చారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం తన నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా అమలు చేయడానికి చూస్తోంది. అందులో లేబర్‌ కోడ్‌లు ప్రధాన మైన భాగంగా వున్నాయి. కీలకమైన జాతీయ వనరులను ముఖ్యంగా రక్షణ, కమ్యూనికేషన్స్‌ వంటి వ్యూహాత్మక రంగాలను ప్రయివేటీకరించే దిశగా చాలా దూకుడుగా ప్రభుత్వం ముందు కెళుతోంది. ఈ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల తలెత్తే వ్యతిరేకతను అణచివేయాలని చూస్తోం ది. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, విస్తృత స్థాయిలో ప్రజానీకం వ్యక్తం చేస్తున్న ఆందోళన లతో సహా కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లను జులై 9 నాటి సార్వత్రిక సమ్మె పునరుద్ఘాటిస్తోంది. ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు తమ మద్దతును ఇప్పటికే ప్రకటిం చాయి. ఆ రోజున పెద్దసంఖ్యలో ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చాయి. కార్మికులను విభజించేందుకు, విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం ఐక్యతను బలోపేతం చేయడానికి రైతాంగం సంఘీభావ చర్యలతో పాటూ ఈ సార్వత్రిక సమ్మె దోహదపడుతుంది. సార్వత్రిక సమ్మెకు మద్దతునివ్వాల్సిందిగా వామపక్షాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. సమ్మెను జయ ప్రదం చేసేందుకు చురుకుగా ప్రచారం చేయాలని, పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని పార్టీల శాఖలన్నింటికీ పిలుపునిచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -