నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలోని 400వ మెట్టు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు గుర్తించి, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మార్గం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపట్టి, చిరుత కదలికలు లేవని నిర్ధారించుకున్న తర్వాత భక్తులను తిరిగి అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భక్తులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
తిరుమల మెట్టు మార్గంలో చిరుత కలకలం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



