Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులనే గెలిపించండి

ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులనే గెలిపించండి

- Advertisement -

– బీజేపీ అభ్యర్థులను ఓడించాలని, లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పిలుపు
నవతెలంగాణ-సదాశివపేట : సంగారెడ్డి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పిలుపునిచ్చారు.సదాశివపేట మండల కేంద్రంలో శనివారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ—బీజేపీ అభ్యర్థులను ఓడించి, లౌకిక ప్రజాతంత్ర శక్తులను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు.జిల్లాలో సీపీఐ(ఎం) అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఫలితంగా పలుచోట్ల భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించగలిగామని జయరాజు తెలిపారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు, భూ వివాదాలు, కార్మికుల కనీస వేతనాలు, ఉపాధి కూలీల సమస్యలు వంటి స్థానిక ప్రశ్నలపై పార్టీ నిరంతర పోరాటం చేస్తోందన్నారు.

సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే సమస్యల పరిష్కారానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. డబ్బు–మద్యం ప్రలోభాలతో ఓట్లు అడుగుతున్న నాయకులను ప్రజలు తిరస్కరించి, నిజాయితీగా గ్రామాల కోసం పనిచేసే వారినే సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతూ, మండలంలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు రమేష్ గౌడ్, భూషణం, ఎషోబు, నర్సిములు, మహేష్, కయ్యుం, ఆంజనేయులు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -