- సిపిఐఎంఎల్ మండల కార్యదర్శి మురళి పిలుపు
నవతెలంగాణ-డిచ్‌పల్లి: అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడుతామని సిపిఐ ఎంఎల్ మాసలైన్ పార్టీ మండల కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు.ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో స్వాతంత్రియ సాధన కోసం లక్షలాదిమంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. భూమికోసం,భక్తి కోసం విముక్తి కోసం పోరాడి కొన్ని ఫలితాలు సాధించుకున్నారన్నారు.. ఆ క్రమంలోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని కానీ ఆ ఫలితాలను దేశంలోని కొద్దిమందిగా ఉన్న పెట్టుబడిదారులు, దోపిడీదారులు స్వార్థపరులు అనుభవించడం ఇది బాధాకరమైన విషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలోని సమస్యలు ముఖ్యంగా రైతు,కార్మిక, యువజన పరిష్కారం కాలేదని పేదరికం దేశంలో తాండవిస్తుందని ధరలు పెరుగుతున్నాయని,నిరుద్యోగం పెరిగిందని ఆయన అన్నారు.
విద్య, వైద్యం, సాగు రంగా అభివృద్ధి కోసం రైతు రక్షణ కోసం కేంద్రంలోని మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పటికీ వారు చేసింది ఏమీ లేదన్నారు. పైగా దేశంలో మతకలహాలను దూరం చేసి అహంకారాన్ని రెచ్చగొడుతూ అధికార పబ్బాన్ని కాపాడుకుంటున్నారని ఆ ఫలితంగా దేశ అభివృద్ధి కుంటుపడుతుందని, దేశ సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ముఖ్యంగా యువతీ యువకులు నేడు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగాన్ని పేదరికాన్ని పారదోలడానికి ముందుకు రావాలని, సాగు రంగం సమస్యల పరిష్కారం కోసం అమరవీరుల త్యాగాలను స్మరించుకొని ముందుకు పోవాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లాలయ్య, కిషన్, నారాయణ, మమత, గంగాధర్, నరేష్, సురేష్, గంగాధర్, ఇమ్రాన్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.



