Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూలై 9న సమ్మెను జయప్రదం చేద్దాం!

జూలై 9న సమ్మెను జయప్రదం చేద్దాం!

- Advertisement -

– ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు
నవతెలంగాణ-జక్రాన్ పల్లి  : భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు 2025 జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. జూలై 6 ఆదివారం ఉదయం జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామపంచాయతీ వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

దాసు పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛభారత్ లో ముందు వరుసలో పాల్గొని ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న సఫాయి కార్మికులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 అక్టోబర్ 26 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనం 26,000 పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస పెన్షన్ 9000 ప్రకటించి అమలు చేయాలని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానమే కొనసాగించాలని, పి ఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని డిమాండ్లతో జులై 9న జరిగే సమ్మెలో పంచాయతీ కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలని దాసు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సఫాయి కార్మికులను కీర్తించి, సన్మానం చేస్తే కడుపునిండదని, వేతనాలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని, 2024 జనాభా ప్రకారం సిబ్బందిని నియమించి పని భారాన్ని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ పంచాయతీ కార్మికుల సమస్యలపై పలుమార్లు రాష్ట్ర మంత్రులకు కలవడం జరిగిందని, ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, గణేష్, శ్రీనివాస్ రెడ్డి, మహిళా కార్మికులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -