Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్మేడే స్ఫూర్తి కొనసాగిద్దాం..

మేడే స్ఫూర్తి కొనసాగిద్దాం..

బీజేపీ మత రాజకీయాల్ని తిప్పికొడదాం
యండి. జహంగీర్.. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి

ప్రపంచ కార్మిక దినోత్సవం 139 మే డే సందర్భంగా భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. ప్రపంచ శ్రామిక జనావళి ని ఒక్కతాటిపై నడిపిన చరిత్ర మేడేదని అన్నారు. దోపిడి శక్తులను తుదమొట్టించి 8 గంటల పనిదినాన్ని సాధించి, కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన ఎర్రజెండా  అమరుల త్యాగాల చరిత్రను నేడు బీజేపీ చెరిపివేయాలని చూస్తోందన్నారు. తిరిగి 12 గంటలు పని దినాన్ని తీసుకురావాలని కుట్ర జోరుగా చేస్తోందని తెలిపారు. కార్మిక కర్షకుల మధ్యన  మతం పేరుతో స్వార్ధ రాజకీయాలకు పూనుకుంటున్నదన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను తిప్పిగొట్టి మే 20న జరిగే అఖిల భారత సమ్మెను కార్మికులు కర్షకులు విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, మరియు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, గందమల్ల మాతయ్య,బోడ భాగ్య, లలిత, యడి.సలీం, ఆఫీస్ కార్యదర్శి వల్లబుదాసు రాంబాబు  పాల్గొన్నారు.
భువనగిరి పట్టణం లో భువనగిరి పట్టణంలోని పలు వార్డులలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయకృష్ణ, నాయకులు గంధ మల్ల మాతయ్య, శాఖా కార్యదర్శులు ఆయా ప్రాంతాలలో ఎర్ర జెండాలను  ఎగరవేశారు. 
హనుమాన్ వాడలో
మేడే ఉత్సవాలను హనుమానవాడలో సీపీఐ(ఎం) ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో నాయకులు కొలుపుల వివేకానంద, బర్ల వెంకటేష్ పల్లెర్ల గంగయ్య పాల్గొన్నారు. పాత బస్టాండ్ లో పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దయాకర్ ఎర్రజెండా ఎగరవేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img