Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుపోషణ లోపం సమాజం ఏర్పాటు చేద్దాం

పోషణ లోపం సమాజం ఏర్పాటు చేద్దాం

- Advertisement -

పోషణ మాసం ప్రారంభం

నవతెలంగాణ సదాశివనగర్:

సదాశివనగర్ మండలం అడ్డూరెల్లారెడ్డి గ్రామ రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోషణ లోపం లేని సమాజం ఏర్పాటుకు కృషి చేద్దామని అంగన్వాడీ టీచర్లు ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయని సూపర్వైజర్ పద్మ తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోషణ అలవాట్ల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, శుద్ధి తాగునీరు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై అంగన్వాడీల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా దేశవ్యాప్త ఉద్యమంలా కార్యక్రమాలు చేపట్టి పిల్లలు మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కృషి చేస్తామని అంగన్వాడీలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు ఎన్ పద్మ, వనజ, పద్మావతి, జ్యోతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ ప్రసాద్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -