- పివైఎల్-పిడిఎస్‌యూ-ఏఐకెఎంఎస్
నవతెలంగాణ-మోపాల్: మోపాల్ మండల కేంద్రంలో సోమవారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బండమీది నరసయ్య, అగ్గు భోజన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులు భగత్ సింగ్ రాజగురు, సుఖదేవులన్నారు. వారి పోరాట స్ఫూర్తితో పరాయి దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా దురాక్రమణాలకు, యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ అమెరికాకి తొత్తుగా మారి, ట్రంపు చెప్పిన ప్రతిదానికి వత్తాసు పలుకుతున్నారని,. దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజగురు సుగదేవుల వర్ధంతి సభలను మార్చి 23 నుండి 30 వరకు వాడవాడల జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచు రవి ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు బండమీది నరసయ్య, వీడిసి సభ్యులు రాజారెడ్డి, విజయ్, గంగాధర్, పిడిఎస్‌యూ, పీవైఎల్ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



