Friday, May 2, 2025
Homeకరీంనగర్మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

-సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్
– దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
– సిరిసిల్లలో ఘనంగా మే డే వేడుకలు 
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్

మే డే స్ఫూర్తితో బిజెపి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా, రైతు బజార్, మున్సిపల్ ఆఫీస్, సివిల్ హాస్పిటల్, నెహ్రు నగర్ , చంద్రంపేట , గణేష్ నగర్ , బి.వై. నగర్ తదితర ఏరియాలలో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. స్థానిక బీ వై నగర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరై, జెండా ఆవిష్కరించి, అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. మేడే కార్మిక దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది ఒక వర్గ పోరాట స్ఫూర్తి దినమని పేర్కొన్నారు.. బీజేపీ ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెంచిందన్నారు. లేబర్ కోడ్ ల రద్దుకై మే 20 న దేశవ్యాప్తం సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటాలన్నారు. ఇట్టి కార్యక్రమాలలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , మూషం రమేష్ , అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , రాపెల్లి రమేష్ , నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , కుమ్మరికుంట కిషన్ , గుండు రమేష్కు డిక్యాల కనకయ్య , బెజుగం సురేష్ , ఎక్కల్దేవి జగదీశ్ , ఉడుత రవి , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , సుల్తాన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img