139వ మే డే సందర్బంగా జిల్లా కేంద్రంలో కదం తొక్కిన ఏఐటీయూసీ కార్మికులు
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం
నవతెలంగాణ – భువనగిరి
కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురిచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కొడ్ల రద్దుకై మేడే స్ఫూర్తితో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్, సివిల్ సప్లై హమాలి యూనియన్, కొత్త వ్యవసాయ మార్కెట్ హమాలీ యూనియన్, కొత్త బస్టాండ్ వద్ద ఘట్కేసర్ రూట్, టాటా మ్యాజిక్ ఉప్పల్ రూట్, యాదగిరిగుట్ట రూట్, టాటా మ్యాజిక్ మోత్కూర్ రూట్, వలిగొండ, తొక్కపూర్ రూట్, స్వర్ణగిరి ఆటో యూనియన్ హైదరాబాద్ చౌరస్తా ఆటో యూనియన్ అడ్డాల వద్ద ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించి భువనగిరి లో ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ 1886 అమెరికా దేశంలోని చికాగో నగరంలోని హే మార్కెట్ లో కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల పేరుతో పని గంటలను 12 గంటలకు మార్చే ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్ ల అమలు వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతునందున కార్మిక వర్గం కలసి కట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల ను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలను ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశ కార్మిక వర్గం నిర్వహిస్తుందని ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, ముంతాజ్ బేగం, బాగల వసంత, వల్దస్ నరసింహ, ముదిగొండ బస్వయ్య, గౌరవంతల శ్రీను, కొత్త కృష్ణ, గుర్రాల శీను, ఏడ్ల నరేష్, మర్రిపల్లి సాయి, ఎండీ సల్మాన్, బోయిని బిక్షపతి, ఎండీ షరీఫ్, విజయలక్ష్మి, కృష్ణ, శారద, నాగరాణి, ఉమరాణి, కరీం, జగన్, అందె కృష్ణ, నరేష్, చంద్రయ్య పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు రద్దుకై పోరాడుదాం..
- Advertisement -
RELATED ARTICLES