Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీలో ఒకే జేఏసీ ఏర్పాటు చేద్దాం

ఆర్టీసీలో ఒకే జేఏసీ ఏర్పాటు చేద్దాం

- Advertisement -

– ఎస్వీకేలో భేటీ అయిన కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఎస్‌ఆర్టీసీ)లో అన్ని కార్మిక సంఘాలతో కలిపి ఒకే జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా శుక్రవారంనాడిక్కడి సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాల నాయ కులు భేటీ అయ్యాయి. ఈదురు వెంకన్న(ఈయూ) చైర్మెన్‌గా ఉన్న జేఏసీ, ఇ అశ్వత్థామరెడ్డి (టీఎమ్‌ యూ) చైర్మెన్‌గా ఉన్న జేఏసీ, టీజీఎస్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు తదితర సంఘాల నేతల ఈ సమావేశంలో పాల్గొన్నారు. అశ్వత్థామ రెడ్డి జేఏసీ ప్రతినిధులుగా టీఎమ్‌యూ నాయ కులు రాజలింగం, ఎన్‌ఎమ్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి హాజరయ్యారు. కే హన్మంతు ముది రాజ్‌ (టీజేఎమ్‌యూ) ఎమ్‌ థామస్‌రెడ్డి (టీఎమ్‌ యూ), ఎమ్‌డీ మౌలానా (ఎన్‌ఎమ్‌యూ), కత్తుల యాదయ్య (బీకేయూ), సుద్దాల సురేష్‌ (బీడబ్ల్యూ యూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్‌) హాజర య్యారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావాలనీ, ఉమ్మడి అజెండాతో పనిచేయాలని నిర్ణయించారు. అన్ని సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్ల డించారు. కార్మికులు కూడా సంఘాల మధ్య ఐక్య తను కోరుకుంటున్నారనే విషయం చర్చకు వచ్చిం ది. సమావేశానికి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎన్‌టీ యూసీ), బీఎమ్‌ఎస్‌, ఎస్‌టీఎమ్‌యూ సంఘాల ప్రతినిధులు హాజరు కానందున ఈ నెల 24న మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహిం చాలని నిర్ణయించారు. సింగిల్‌ జేఏసీగా ఏర్పాట య్యాక ఉమ్మడి అజెండాతో భవిష్యత్‌ పోరాటాలు నిర్వహించాలని ఆయా సంఘాల నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -