– కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు హెచ్ అలివేలు
నవతెలంగాణ- నెల్లికుదురు : జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భారీ లో ఉన్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి వైపు మనందరం కలిసికట్టుగా నడవాలని కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల నాయకురాలు హెచ్ అలివేలు ఓటరు దారులను కోరినట్లు తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడప గడపకు చేరే విధంగా కృషిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా ఉండేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. అంతేకాకుండా మన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మరియు పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్,లు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి లు కోట్లాది నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని కాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ను పోటీలో ఉన్న అందరిని అధిక మెజార్టీతో గెలిపించి మనపై ఉన్న అధినాయకత్వానికి గిఫ్టుగా ఇస్తే, మన ప్రాంతం ఇంకా అనేక రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి వైపు నడవండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



