Wednesday, March 25, 2026
E-PAPER
Homeఖమ్మంప్రకృతిని కాపాడుకుందాం.. వన్యప్రాణులను రక్షించుకుందాం

ప్రకృతిని కాపాడుకుందాం.. వన్యప్రాణులను రక్షించుకుందాం

- Advertisement -

– సమతుల్య పర్యావరణ మే జీవకోటికి ప్రాణాధారం – ఎఫ్ఆర్ఓ మురళి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రకృతిని కాపాడుకుంటూ, వన్యప్రాణులను రక్షించుకోవడంతో సమతుల్య పర్యావరణ వర్ధిల్లి జీవకోటి ప్రాణాధారంగా ఉంటుంది అని ఎఫ్ఆర్ఓ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) మురళి అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫ్‌ఆర్‌ఓ మురళి హాజరై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి “ప్రకృతిని ప్రేమించండి – వన్యప్రాణులను రక్షించండి” అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు సంపత్, రమ, కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎఫ్‌బీఓలు సురేష్ కుమార్, నరసింహరావు, పవన్ కళ్యాణ్, వెంకయ్య, శృతి, చైతన్య, వీరన్న, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలందరూ వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -