Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం…

ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం…

- Advertisement -

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి…
 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : ఏప్రిల్ 7న నిర్వహించే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని“ఆరోగ్యం కోసం కలిసికట్టుగా – విజ్ఞానానికి అండగా నిలబడదాం” అనే 2026 ప్రచార నినాదంతో కార్యక్రమాని ప్రారంభించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హెల్త్ వీక్ – డే-2 కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అద్వర్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని  ఎన్ క్యూ ఏ ఎస్ 

సర్టిఫికేషన్‌కు సిద్ధంగా ఉండాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో మెరుగైన వైద్య సేవలను పేద ప్రజలకు అందించాలని సూచించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 68 మంది ఆరోగ్య సిబ్బందికి  కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా  మనోహర్  మాట్లాడుతూ, జిల్లాలోని సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేయాలని, సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రమైన పరిసరాలు, సమతుల ఆహారం మరియు నియమిత వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, నీటి నిల్వలు లేకుండా దోమల వ్యాప్తిని నివారించడం అత్యవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  భాస్కర్ రావు, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా. యశోద, డా. వీణ, డా. వంశీ కృష్ణ, డా. సుమన్ కళ్యాణ్, డా. ఇందిర మణి, గైనకాలజీ విభాగం హెచ్‌వోడి, వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -