Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంక్యూబా ప్రజలకు అండగా ఉందాం

క్యూబా ప్రజలకు అండగా ఉందాం

- Advertisement -

అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలను ఎదిరించాలి :
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌

అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలకు తలొగ్గకుండా కార్మిక, కర్షకుల రక్షణ కోసం నికరంగా నిలబడిన క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు అందరూ సంఘీభావం తెలపాలని, అండగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సూరారం డివిజన్‌ షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో గురువారం సాయంత్రం సీఐటీయూ జీడిమెట్ల క్లస్టర్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యూబాకు సంఘీభావంగా నిధి సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామ్రాజ్యవాద దేశమైన అమెరికా నిరంతరం క్యూబా దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశ ప్రజలు తిప్పికొడుతూ వీరోచితంగా నిలబడుతున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తిదాయకం అన్నారు. క్యూబాకు ఆర్థిక సహాయం అందించడం అత్యవసరమని, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని కోరారు. మానవతా దృక్పథంతో క్యూబా ప్రజలకు సహాయం అందించాలని కోరారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు సీఐటీయూ ఆవిర్భావం నుంచీ ధన, వస్తు రూపాల్లో అనేకమార్లు సహాయం అందిస్తూనే ఉందని తెలిపారు. మన దేశంలోని నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా కమిటీలో సీఐటీయూ కూడా భాగస్వామిగా ఉండి కార్మిక సంస్థగా అంతర్జాతీయతతో పని చేస్తూ ప్రపంచ కార్మికవర్గానికి అండగా నిలబడుతోందన్నారు. దాంట్లో భాగంగానే సీఐటీయూ అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలూ, కమిటీలు, నాయకులు ఆగస్టు 10 వరకు క్యూబా సంఘీభావ నిధిని వసూలు చేసి ఆ దేశానికి అండగా ఉండాలని కోరారు. సీఐటీయూ మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్‌ మాట్లాడుతూ.. భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమల నాశనం వెనుక అమెరికా హస్తం ఉందని, మన కార్మిక చట్టాల రద్దుకు అమెరికా ఒత్తిడిలే కీలకమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా వల్లే భారతీయ పరిశ్రమలెన్నో విలవిల్లాడి మూతబడుతు న్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జీడిమెట్ల క్లస్టర్‌ అధ్యక్ష కార్యదర్శులు పసుల అంజయ్య, రమేష్‌, కుత్బుల్లాపూర్‌ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్‌, కృష్ణ, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img