Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మట్టి గణపతులనే పూజిద్దాం 

మట్టి గణపతులనే పూజిద్దాం 

- Advertisement -

నవతెలంగాణ- కాటారం
 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో కామెడీ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం తను మాట్లాడుతూ… మన సంస్కృతిలో ముఖ్యమైన గణేశా చతుర్దశి పండుగ సందర్భంగా పర్యావరణానికి ఎలాంటి హాని కలగాని మట్టి గణపతులను పూజిస్తూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులను బహిష్కరిద్దామని తను తెలిపాడు. అంతే కాకుండా మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత” ప్లాస్టర్ ఆఫ్ పారిస్” విగ్రహాలు నీటి కాలుష్యాన్ని కి దారితీస్తాయి. కానీ మట్టి గణపతులు పర్యావరణానికి ఎలాంటి హాని కలగా చేయవు. నీటి లో కలిసిపోయి భూమికి సారం అందిస్తాయి. అందుకే మనం అందరం మట్టి గణపతులను ఉపయోగించి పండగను ఆనందంగా జరుపుకోవాలని తను అన్నాడు. ప్రతి సంవత్సరం తన సొంత పైసలతో మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నానని, పర్యావరణ కాలుష్యం కాకుండా  అందరి బాధ్యతని, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండపర్తి మురారి, తోటి మనోహర్,గాజుల కుమార్, జీముడా వంశీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -