Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంథాలయాలే పాఠశాలల పట్టుగొమ్మలు

గ్రంథాలయాలే పాఠశాలల పట్టుగొమ్మలు

- Advertisement -

ఎంఈఓ సత్యనారాయణ శెట్టి
నవతెలంగాణ – తిమ్మాజిపేట

గ్రంథాలయాలే పాఠశాలల పట్టుగొమ్మలు అని ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కొరకు పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించరు. మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రంథాలయాల అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి మండల ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ కరోనా కాలంలో విద్యార్థులు టీవీ, మొబైల్ స్క్రీన్ లకు బానిస అయ్యారని, వారిని మళ్లీ పుస్తకాలకు చేరువ చేయాల్సిన బృహత్తర బాధ్యతను ఉపాధ్యాయులు తలకెత్తుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా కే జయపాల్ రెడ్డి, ఎస్ మనోహర్, ఎం బాలయ్య, కే కార్తీక్ కుమార్, ఏ సుధాకర్ గౌడ్, ఎం సుధాకర్ గౌడ్ లు వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -