పాలమూరు సాహితి అవార్డు-24కు కాంచనపల్లి ‘పెంకుటిల్లు’ ఎంపిక
తెలుగు సాహిత్యరంగంలో విశేషకషి చేస్తున్న కవులకు గత పదిహేను సంవత్సరాలుగా పాలమూరు సాహితి కవితాసంపుటాలకు పురస్కారాలను అందజేస్తున్నది. 2024 సంవత్సరానికిగాను ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు రచించిన ”పెంకుటిల్లు” కవితాసంపుటి ఎంపికైంది. త్వరలో కాంచనపల్లికి ఈ పురస్కారానికి గాను 5,116 నగదు మరియు జ్ఞాపిక శాలువతో సత్కారం ఉంటుంది. పురస్కారపు తేదీ తర్వాత ప్రకటించగలం.
– డా. భీంపల్లి శ్రీకాంత్, 9032844017
కవితలపోటీ
సాహితీకిరణం సౌజన్యంతో కొసరాజు ఆర్తి, జాహ్నవి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే జాతీయ స్థాయి పోటీకి ‘అంతా అవినీతి మయం- అంతం చేయాలి మనమిక’ అనే అంశంపై కవితలను ఆహ్వానిస్తున్నది. 20 – 30 లైన్ల కవితలను ఆగస్టు 31 లోపు ‘ఎడిటర్, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్ నెం.3, హైదరాబాద్-500102 చిరునామాకు పోస్ట్, కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. వివరాలకు సెల్:9490751681
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -