‘నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రం నుంచి ‘రాజా గాడికి..’ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ.. ‘ఈ కథను ఫస్ట్ మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్ నమ్మారు.
అలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మారాను. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీని వంశీ, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ‘మా డైరెక్టర్ సాయి మార్తాండ్ మంచి స్క్రిప్ట్ రాశాడు. తను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయడంలో మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పగలను. ఫుటేజ్ చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్‌గా చాలా సంతప్తి పడ్డాను. ఈ చిత్ర ట్యాగ్‌లైన్ లాగే హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ దాకా మీరు కథతో రిలేట్ అవుతారు. 2 గంటలు ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు. ఈ సినిమా ప్రివ్యూను వంశీ, బన్నీవాస్ చూస్తున్నప్పుడు ఏం రెస్పాన్స్ ఇస్తారో అని భయపడ్డా కానీ వాళ్లు సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నారు. వాళ్లిద్దరికీ ఈ మూవీ థియేట్రికల్‌గా పెద్ద సక్సెస్ అందిస్తుందని నమ్ముతున్నా’ అని ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ చెప్పారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ,’ఈ సినిమాను మేము చూస్తున్నప్పుడు ఇది థియేట్రికల్ కంటెంట్, థియేటర్స్‌లో బ్లాస్ట్ అవుతుంది అనిపించింది. కాలేజ్ అయ్యాక ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అబ్బాయి తన లవ్ సక్సెస్ చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఎంటర్ టైన్ చేస్తుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా చూస్తున్నంత సేపూ నేనూ బాగా ఎంజారు చేశాను. సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో ఈ సినిమా చూసే ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా నవ్వుకుంటారు’ అని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ చెప్పారు.