- Advertisement -
నవతెలంగాణ-నకిరేకల్ : కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన వల్లపు పద్మ, వల్లదాస్ వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టణంలోని తన నివాసంలో పద్మ కు మంజూరైన రూ. 2.50 లక్షల, వెంకటమ్మకు రూ. లక్ష మంజూరైన ఎల్ఓసి కాపీలను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరబోయిన నరసింహ తదితరులు ఉన్నారు.
- Advertisement -