– ప్రయోగ పంటలు పరిశీలన…
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక వ్యవసాయ కళాశాలను శనివారం కొత్తగూడెం,ఖమ్మం కు చెందిన 80 మంది దేశీ ( డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ ) డీలర్స్ క్షేత్ర సందర్శన చేసారు. ఈ సందర్శనలో స్థానిక కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి.నీలిమ,డాక్టర్ ఎన్. చరిత సమన్వయంతో కళాశాలలోని వివిధ పంటలైన కూరగాయలు,ముఖ్యంగా మునగ,మామిడి,కొబ్బరి, ఆయిల్ పామ్ గురించి విపులంగా యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రైతులు ఎలాంటి పంటలు ఎలా పండించాలి, సరైన సమయంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణలు, నీటి యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ మరియు కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా ఎలాంటి పంటలు వేసుకోవచ్చు అనే అంశం గురించి చర్చించడం జరిగింది. కళాశాలలో నూతనంగా తయారుచేసిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని ముఖ్యమైన యూనిట్స్ అయిన జీవ నియంత్రణ ల్యాబ్ భూసార పరీక్ష ల్యాబ్ మరియు వర్మీ కంపోస్ట్ యూనిట్లు సందర్శించారు.
వ్యవసాయ కళాశాలను సందర్శించిన దేశీ డీలర్స్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES