– మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కోకన్వీనర్ జబ్బార్, జిల్లా నాయకులు బాల్ సింగ్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో మదినబాంత గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే సంస్థ గత స్థానిక ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇంప్రూవ్మెంట్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.
రాబోయే రోజుల్లో గిరిజన్లో గనుక 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలిపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం నాయక్, నర్సింలు నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.