నవతెలంగాణ – రామారెడ్డి
గెలుపు గుర్రాలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అందించి, గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా ఉండాలని అన్నారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారంం మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజాదారణ కలిగి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి, ప్రజలకు సేవ చేసే వారికి టిక్కెట్లు అందుతాయని అన్నారు. పేట్ సంగం తండాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాలోత్ సుభాష్ నాయక్ ఆహ్వానం మేరకు దసరా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సల్మాన్, గంగారెడ్డి, రగోతం రెడ్డి, మైసా గౌడ్, దయానంద్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.