నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌సభ ఈరోజు నిరవధిక వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు సజావుగా సాగలేదు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై లోక్‌సభలో చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సమావేశాలు ప్రారంభమై నేటికి 21వ రోజవుతున్నా.. ఎస్‌ఐఆర్‌పై చర్చ పెట్టడానికి అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీల నిరసనలతోనే సభ గడిచింది. గురువారం లోక్‌సభకు ప్రధాని మోడీ వచ్చారు. ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్‌పై చర్చకు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా నడిపించలేకపోతున్న ప్రతిపక్షాల తీరుతో స్పీకర్ ఓం బిర్లా విసుగెత్తి సభను నేడు నిరవధికంగా వాయిదా వేశారు. ప్రతిపక్షాల వల్లే ఈ సెషన్ జరిగ్గా జరగలేదని ఆయన అన్నారు.
లోక్‌సభ నిరవధిక వాయిదా
- Advertisement -
- Advertisement -