నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం పార్లమెంట్ సమావేశాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. మాజీ ఆర్మీ జనరల్ రాసిన బుక్‌పై కీలక విషయాలు ఉన్నాయని, ఆ ఆంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనలు బాటపట్టాయి. స్పీకర్ పోడియం ముందుకు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. సభ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్య మంగళవారం లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఆర్మీ జనరల్ ఎంఎం.నరవణెకి చెందిన ఒక పుస్తకం నుడి కొన్ని అంశాలను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సోమవారం లేవనెత్తిన సంగతి తెలిసిందే. నవరణె ప్రచురించని పుస్తకం నుండి కొన్ని కోట్‌లను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీపై తేజస్వీ సూర్య చేసిన ఆరోపణలకు ప్రతిస్పందించేందుకు రాహుల్‌గాంధీ యత్నించారు. ఆయనకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడంలో సభలో గందరగోళం నెలకోంది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
కొత్తగా ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపి కె.సి.వేణుగోపాల్ వాయిదా తీర్మానం సమర్పించారు. నివేదించబడిన ఒప్పందంలో గణనీయమైన ఆర్థిక, వ్యవసాయ, వ్యూహాత్మక చిక్కులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అధికారిక పకటన చేయలేదు అలాగే పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోలేదని అన్నారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో నిబంధనలు, షరతులు దేశ ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని, అదేవిధంగా ప్రభుత్వం అన్ని వివరాలను పార్లమెంట్ మరియు దేశ ప్రజల ముందు ఉంచడం అత్యవసరం అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశం ఆవశ్యకత, ప్రజాప్రాముఖ్యత దృష్ట్యా, ఈ అంశంపై వాయిదా తీర్మానం ద్వారా తక్షణ చర్చకు అర్హత ఉందని పేర్కొన్నారు.



